నిర్మల్ లో రాంజీ గోండు వర్ధంతి కార్యక్రమం

2చూసినవారు
నిర్మల్ లో రాంజీ గోండు వర్ధంతి కార్యక్రమం
నిర్మల్ జిల్లా కేంద్రంలో గోండుల తొలి పోరాటయోధులు రాంజీ గోండు వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైన్ గేట్ సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిర్మల్ నడిబొడ్డున ఉన్న మర్రి చెట్టుకు రాంజీ గోండుతో పాటు వెయ్యి మందిని ఉరితీసారని గుర్తు చేస్తూ, బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాటం చేసి స్వాతంత్రం కోసం అసువులు బాసిన సమరయోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. దేశం కోసం పోరాడిన వారి నుండి స్ఫూర్తిని పొందాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్