సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఆర్డీవో రత్న కళ్యాణి

0చూసినవారు
సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఆర్డీవో రత్న కళ్యాణి
గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని ఆర్డిఓ రత్న కళ్యాణి తెలిపారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో గురువారం మండల స్థాయి సీఎం కప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. మండల స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలని క్రీడాకారులకు ఆర్డిఓ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనిత, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :