అడెల్లి పోచమ్మ ఆలయ పునఃప్రారంభం: వేడుకల్లో భక్తుల కోలాహలం
సారంగాపూర్ మండలం శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయ పునఃప్రారంభోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఆలయ మూడవ రోజు బుధవారం రాత్రి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిత్యవిధి చండి హోమం, ఫలా పుష్ప దివాసనం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాలకు పండ్లు, పూలతో అభిషేకాలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమంలో పాల్గొన్నారు.