వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించిన నివారణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ విభాగాల ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వరద నష్ట నివారణ చర్యలపై సమావేశం నిర్వహించి, చేపట్టిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.