ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తీ చేయాలనీ కలెక్టర్ కు వినతి

0చూసినవారు
ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తీ చేయాలనీ కలెక్టర్ కు వినతి
నిర్మల్ జిల్లా ముధోల్ లో మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 2022లో శంకుస్థాపన జరిగినా నాలుగున్నరేళ్లుగా నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందని పేర్కొన్నారు. ముధోల్, బాసర, లోకేశ్వరం, తానూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్