ఉద్యోగ విరమణ పొందిన లైబ్రేరియన్ రాజారాంకు ఘన సన్మానం

2చూసినవారు
ఉద్యోగ విరమణ పొందిన లైబ్రేరియన్ రాజారాంకు ఘన సన్మానం
మామడ మండల కేంద్రంలో లైబ్రేరియన్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన పగడం రాజారాంను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు ఘనంగా సన్మానించారు. రాజారాం గ్రంథాలయ అభివృద్ధికి, విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో విశేష కృషి చేశారని శ్రీహరి రావు కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :