ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజం

0చూసినవారు
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని, పదవీ విరమణ అనంతర జీవితం సుఖశాంతులతో గడవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం సోన్ మండలం ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వర్తించి, పదవీ విరమణ పొందుతున్న సురేష్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీడీవోగా మండలంలో సురేష్ చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి అధికారి డిప్యూటీ జడ్పీ సీఈవో శంకర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :