ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి: ఎస్పీ

0చూసినవారు
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి: ఎస్పీ
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న గంగాధర్, సుదర్శన్, గణేష్, కెవి. రాజారెడ్డి, మల్లేశ్వర్ లను ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని ఆమె అన్నారు. పోలీసు శాఖలో అంకితభావంతో అందించిన సేవలను, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్