ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: బీజేపీ

3చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దేశ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర, దేశ ప్రజలకు తలవంచే విషయమని మండిపడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :