నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో శనివారం న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల అండర్‌ట్రయల్ ఖైదీల కేసులపై సమీక్ష నిర్వహించారు. జైల్లో ఉన్న ఖైదీల కేసుల స్థితిగతులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనవసరంగా ఖైదీలు జైల్లో ఉండకుండా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, ఆర్డిఓ, పోలీస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.