
టీ స్టాల్ నడుపుతున్న 103 ఏళ్ల బామ్మ (వీడియో)
గుజరాత్‌కు చెందిన 103 ఏళ్ల కషిబా అనే బామ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు మీద పడినా విశ్రమించకుండా పని చేస్తున్నారు. వడోదరలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ‘జీవితం అంత సులభం కాదు.. వదులుకోవడం ఎప్పటికీ ఎంపిక కాకూడదు’ అని ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.




