నిర్మల్ పట్టణంలో రోడ్ల మరమ్మత్తు పనులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ చౌక్ సమీపంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన ఆమె, గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులను సకాలంలో పూర్తి చేయాలని, గుంతల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. పనులన్నీ నాణ్యతతో జరగాలని, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.