దేశ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చేస్తున్న సేవలు ప్రశంసనీయమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్మల్ నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పథ సంచలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంసేవకులు ఎన్నో విపత్తుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్ కూడా పాల్గొన్నారు.