నిర్మల్ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

0చూసినవారు
నిర్మల్ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ఉద్యోగులు ఆదివారం ఎర్ర బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. ఎన్నికలు వద్దు, విలీనం ముద్దు అంటూ నినాదాలు చేశారు. జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, గెలుపొందిన సభ్యుల నిర్ణయం మేరకు విలీన ప్రక్రియ చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం సరికాదని ఉద్యోగులు పేర్కొన్నారు. ఎన్నికలను పక్కనపెట్టి తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్