తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సాదు శ్రీనివాస్‌కు ఘన సన్మానం
మెండోర మండల తహసిల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాదు శ్రీనివాస్ రెడ్డిని కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖలో సేవలందించి తహసిల్దార్ పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డిని సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ బాసీద్, మహమ్మద్ అజీం కూడా పాల్గొన్నారు.