శబరి యాత్ర: ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవితం - సయ్యద్ బషీర్ అలీ

0చూసినవారు
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని నిర్మల్ రూరల్ మండలం మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బషీర్ అలీ తెలిపారు. ప్రతి ఏడాది అత్యంత భక్తి ప్రపత్తులతో కాలినడకన శబరి కి వెళ్లి వచ్చిన ఆకారపు ప్రవీణ్ కుమార్ ను నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువలు, పూలమాలలతో సన్మానించి అభినందించారు. దైవత్వ భావాలు మానవత్వ విలువలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్