నిర్మల్ జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీని అడ్డం పెట్టుకొని కొందరు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ఖాళీ గన్నీ బ్యాగులను రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఆటోలో తరలిస్తున్న సంచులను గమనించగా, వాటి రంగులు మార్చి బహిరంగ మార్కెట్లో రూ.50 వరకు అమ్ముతామని వ్యాపారులు తెలిపారు. ఈ అక్రమాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది.