నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలోని మల్లన్న స్వామి ఆలయంలో ఆదివారం సల్లకుండల పండగ అత్యంత వైభవంగా జరిగింది. అయిదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మల్లన్నస్వామికి ప్రీతిపాత్రమైన సల్లకుండలతో బోనాలను భక్తులు సమర్పించుకున్నారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని సల్లకుండల పండగ నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనాలతో బాజాభజంత్రీలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.