సారంగాపూర్ మండల
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీటీసీ సామల పద్మ నియమితులయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా మహిళా
కాంగ్రెస్ అధ్యక్షురాలు సిహెచ్ భవాని ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సామల పద్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. సామల పద్మ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.