సారంగాపూర్: మైనార్టీస్ స్కూల్ సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు
సారంగాపూర్ మండలంలోని చించోలి బిలో గల మైనార్టీస్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ను సోమవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకాలు దుస్తులు పరిశీలించారు. పిల్లలకి అందజేస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వార్డెన్ తో పలు విషయాలు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఖాజా అక్రం అలీ, రిజ్వాన్ ఖాన్, మహబూబ్ లు ఉన్నారు.