సర్పంచ్ కోనేరు భూమన్న: సమస్యల పరిష్కారానికి దశలవారీ ప్రణాళిక
సారంగాపూర్ మండల గ్రామ పంచాయతీ తొలి సర్వసభ్యుల సమావేశంలో సర్పంచ్ కోనేరు భూమన్న మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, కోతుల బెడద, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.