చిన్నారులపై సర్పంచ్ భర్త దాడి: కేసు నమోదు

3చూసినవారు
ముథోల్ మండలం సింగన్గావ్ గ్రామంలో మంగళవారం గ్రామ అభివృద్ధి పనుల కోసం తెచ్చిన ఇసుక కుప్పలపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను సర్పంచ్ భర్త రాములు కర్రతో కొట్టి గాయపరిచినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పిల్లలు ఆడుకోవద్దని చెప్పినా వినకపోవడంతో ఆగ్రహించి దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై షేక్ జుబేర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్