సీనియర్ పాత్రికేయులు పోశెట్టిని పరామర్శించిన ఎమ్మెల్యే

0చూసినవారు
సీనియర్ పాత్రికేయులు పోశెట్టిని పరామర్శించిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ పాత్రికేయులు పూసల పోశెట్టిని, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న పోశెట్టి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయన త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్