మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్న కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ
కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ శ్రీహరిరావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక బీజేపీయా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అవమానాలు కొనసాగితే ఇన్‌ఛార్జ్ పదవిని వదులుకుని సాధారణ కార్యకర్తగా ఉంటానని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.