నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామ పంచాయతీ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామంలోకి ఐస్ క్రీమ్ ఆటోలు, ఖారీ బండ్లకు ప్రవేశం లేదని, నిబంధనలు అతిక్రమించి అమ్మితే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.