మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాల కేసుల పరిష్కారం

2చూసినవారు
హైకోర్టు జడ్జి, మీడియేషన్ కమిటీ ఛైర్మన్, జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మధ్యవర్తిత్వ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ఇరు పక్షాల మధ్య వివాదాలను స్వచ్ఛందంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కుటుంబ తగాదాలు, విడాకులు, భృతి, పిల్లల కస్టడీ, కుటుంబ ఆస్తుల పంపిణీ, సివిల్ తగాదాలు, రాజీపడగల క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన కేసులు వంటివి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్