ఏడు పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత

343చూసినవారు
ఏడు పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సోన్ మండలంలోని ఏడు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటాయి. జడ్పీహెచ్ఎస్ కడ్తాల్, జాఫ్రాపూర్, న్యూ వెల్మల్, మాదాపూర్, సిద్దిలకుంట, సోన్ కేజీబీవీ, లెఫ్ట్ పోచంపాడ్ టీజీఎస్ డబ్ల్యూజీఎస్ పాఠశాలలు ఈ ఘనత సాధించాయి. టీజీఎస్ డబ్ల్యూజీఎస్ పాఠశాల విద్యార్థిని టీ. రాగిణి 574 మార్కులతో మండలంలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, సోన్ కేజీబీవీ విద్యార్థిని బి. సమీక్ష 539 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలు విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల బోధనకు నిదర్శనంగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్