సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని పొలిమేర దేవత అంపుడు పోచమ్మ వద్ద సోమవారం షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, ప్రజలందరినీ చల్లంగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. గ్రామంలోని పలువురు దాతల సహకారంతో ఈ షెడ్డు నిర్మించినట్లు తెలిపారు.