నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం LL.B పట్టా పూర్తి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్ ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో DEO భోజన్న ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ న్యాయ విద్య పూర్తి చేయడం అభినందనీయమని, తన జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించాలని DEO భోజన్న ఆకాంక్షించారు. అరవింద్ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.