సోన్ మండల కేంద్రంతో పాటు పాక్ పట్ల, జాఫ్రాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఖాళీ బస్తాలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని అకాల వర్షాలు కురిస్తే మొక్కజొన్న తడిసిపోయే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.