నిర్మల్ పట్టణ ప్రాచీన సంస్కృతికి నిలయమైన శ్యామ్ గఢ్ కోట నిరాదరణకు గురవుతోంది. గుప్త నిధుల వేటలో కేటుగాళ్లు కోట గోడలను తవ్వుతూ చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో కోట అడవిలా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో పాటు ఆక్రమణలకు గురవుతోంది. అధికారులు స్పందించి మొక్కలను తొలగించి కోటను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.