బాసరలో ఘనంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణోత్సవం

0చూసినవారు
నిర్మల్ జిల్లా బాసరలోని బజార్ గల్లీలో బాలగణేష్ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉమ్మాయి సాయి సుధ, ధనంజయ్ రావు దంపతులు శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం రాజు, పులోళ్ల రాజు ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణం, కుటుంబ సౌభాగ్యం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్