నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన వెండి, బంగారు వర్తకుల సంఘం ఎన్నికల్లో కోటగిరి అశోక్ అధ్యక్షులుగా, ఆదుముల్ల నర్సయ్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ పొలిశెట్టి సురేందర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన సభ్యులు సంఘ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.