నిర్మల్ పట్టణంలోని అన్ని కాలనీలలో SIR సర్వే కొనసాగుతోంది. శుక్రవారం, 27 జూన్ 2026న, వార్డ్ నెంబర్ 41 పరిధిలోని జోహరా నగర్, సరద్ మహల్, కళానగర్ లలో బూత్ లెవెల్ అధికారులు అభ్యర్థుల వివరాలను సేకరించారు. ఈ సర్వేకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్ బక్కన్నతో పాటు అన్వర్ ఖాన్, ఎండి జఫర్, అఖిల్, వసీమ్ మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఈ సర్వే జరుగుతోంది.