సోన్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రయోగశాలలో విద్యార్థులకు ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, మానవ శరీర రచనకు సంబంధించిన పరిజ్ఞానం పెంపొందించేలా వివిధ రకాల నమూనాలను ఏర్పాటు చేశారు.