నిర్మల్ జిల్లా కుబీర్ మండలం డోడర్నా తండాకు చెందిన జాలుబాయి అనే వృద్ధురాలు తన కొడుకులు ఆస్తిని తమ పేరుపై రాసుకుని, ఆమెను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించారు. 20 ఏళ్ల క్రితమే భర్త మరణించడంతో, కొడుకులే తనకు అండగా ఉంటారని నమ్మిన ఆమె, ఇప్పుడు అన్నం పెట్టకుండా ఒంటరిగా జీవించే పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. తన ఆస్తి తనకు ఇప్పించి, చివరి రోజులు గౌరవంగా, సాఫీగా సాగేలా చూడాలని ఆమె వేడుకుంటోంది.