నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఐటీ కోర్ టెక్నికల్ బృందం రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వివి శ్రీనివాస్ రావు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకుంది. బుధవారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి వారిని అభినందించారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పనిచేసి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ పర్యవేక్షణ, డేటా నిర్వహణ, ఆధునిక పోలీస్ సిబ్బందికి సాంకేతిక మద్దతు అందించడంలో ఈ బృందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.