నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 64 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 ఏళ్లు నిండిన, లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ద్విచక్ర వాహనాలు నడపాలని స్పష్టం చేశారు. 45 వాహనాలకు రూ. 11,295 పెండింగ్ చలాన్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.