కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో దుర్గామాతకు విశేష పూజలు, అన్నదానం

1చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ కాలనీలో గల కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాతకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్ సమాజ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నామని, రాత్రి దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్