నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో బుధవారం దత్త జయంతిని పురస్కరించుకొని పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గంగోని భూరాజ్ మాట్లాడుతూ, దత్త జయంతి సందర్భంగా చేపట్టిన అఖండ సాయినామం గురువారం మధ్యాహ్నం హారతి అనంతరం ముగుస్తుందని తెలిపారు. గురువారం ఉదయం బాబా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భూమయ్య, సాయిదీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.