నిర్మల్ జిల్లాలో ఆదివారం జామ్ ప్రీమియర్ లీగ్ మరియు గ్రామ VDC ఆధ్వర్యంలో పట్టాభి రామ
క్రికెట్ గ్రౌండ్లో చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు విద్యార్థులకు బహుమతులు, పండ్లు అందించారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని JPL నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ VDC సభ్యులు, సర్పంచ్ కరిపే రవళి విలాస్, అధ్యక్షులు గడ్డల రాజు,గ్రామస్థులు పాల్గొన్నారు.