మామడ మండలం పొన్కల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోదా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు రామచంద్రచారి, విజయ సారథి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం "గోవిందా గోవిందా పొనకంటి వెంకటరమణా గోవిందా గోవిందా" అంటూ మారుమోగింది. అనంతపేట్, పోతారం, కమల్ కోట్, ఆదర్శనగర్, నిర్మల్, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.