డీఎంహెచ్ఓను అభినందించిన శ్రీహరి రావు

0చూసినవారు
డీఎంహెచ్ఓను అభినందించిన శ్రీహరి రావు
నిర్మల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, మాతృత్వ మరణాలను తగ్గించేందుకు చేపట్టిన 'అమ్మరక్షిత' కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు అందుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇన్చార్జి కూచారి శ్రీహరి రావు బుధవారం అభినందించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్