కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు

1చూసినవారు
కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు
జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించిన సందర్భంగా, సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.