దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచారి శ్రీహరి రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ అభివృద్ధికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, ఆలయ చైర్మన్ మహేందర్, ధర్మకర్తలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.