సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికిన శ్రీహరి రావు

2చూసినవారు
సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికిన శ్రీహరి రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారులుగా మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, నిర్మల్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :