నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థాన ఆలయ 69వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు మంగళవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ భీమ్ రెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.