తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.