వైద్యునిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు

3చూసినవారు
వైద్యునిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు
జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యునిపై జరిగిన దాడిని కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్