పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

1చూసినవారు
పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్